వార్త ముఖ్యాంశాలు
- కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొంచెం ఆలస్యంగా తెలియవచ్చింది.
- సదరు అధికారి బెంగళూరులోని ఓ పబ్లో మద్యం సేవించి, మద్యం మత్తులో ఆ పబ్లో వీరంగం సృష్టించారని తెలుస్తోంది.
- మద్యం మత్తులో పోలీసులపై దూషణలకు దిగడంతోపాటు, వారిపై దాడికి యత్నించినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఆయనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొంచెం ఆలస్యంగా తెలియవచ్చింది. సదరు అధికారి బెంగళూరులోని ఓ పబ్లో మద్యం సేవించి, మద్యం మత్తులో ఆ పబ్లో వీరంగం సృష్టించారని తెలుస్తోంది. మద్యం మత్తులో పోలీసులపై దూషణలకు దిగడంతోపాటు, వారిపై దాడికి యత్నించినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఆయనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఇలా పొరుగు రాష్ట్రంలోని పబ్కు వెళ్లి, మద్యం సేవించి, అక్కడ వీరంగం సృష్టించి, పోలీసులపైనే దాడికి యత్నించారనే వార్తలు వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పైగా, ఈ ఐఏఎస్ అధికారి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే అధికారి కావడం గమనార్హం.
ఈ యువ ఐఏఎస్ అధికారిని ఎంతో నీతిమంతుడు, పనిమంతుడని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనను ఏరికోరి తన సొంత నియోజకవర్గమైన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా నియమించుకున్నారు . ఈ సంఘటనతో చంద్రబాబు నాయుడు నమ్మకం కూడా వమ్మయినట్లు ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
-ఆది నుంచీ వివాదాస్పదుడే
-ఉన్నత స్థాయిలో విచారిస్తే వెలుగుచూడనున్న ఎన్నో నిజాలు
బెంగళూరు పబ్లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి, పోలీసులపైనే దూషణలకు దిగి, దాడికి యత్నించినట్లు కేసు నమోదైన వికాస్ మర్మత్ ఆది నుంచీ వివాదాస్పదుడేననే విమర్శలు ఉన్నాయి. కాకపోతే, ఆయనకు ఉన్న ఐఏఎస్ హోదా ఆయన అక్రమాలు తెరపైకి రాకుండా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ ముసుగులో ఆయన ఎన్నో అక్రమాలకు, అవినీతికి ఒడిగట్టినట్లు అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఐఏఎస్ వంటి ఉన్నత స్థానంలో ఉన్న అధికారి కావడంతో ఆయనపై ఆరోపణలు చేసేందుకు ఎవరూ సాహసించేవారు కాదని చెబుతున్నారు.
వికాస్ మర్మత్ గతంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్నప్పుడు మీడియాను శత్రువుగా చూసేవారు. చిన్నచిన్న విషయాల్లో సైతం ఆయన మీడియాను దూరంగా పెట్టేవారు. మీడియా అంటే ఆయనకు మొదటి నుంచీ ఎందుకో పెద్దగా పడేది కాదు.
ఆయన నెల్లూరు లో ఎన్నికల అధికారిగా పని చేసినప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన బదిలీ అయిన కొద్ది రోజుల తర్వాత ఈ ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా విచారణ జరిపితే ప్రభుత్వ ధనాన్ని ఎలా ఖర్చు చేశారో అర్థమవుతుంది. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ ఎన్నికల ఖర్చులు చేసినట్లు తెలియవస్తుంది . ఈ ఖర్చు వెనుక లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలైతే ఉన్నాయి .
నెల్లూరు కమిషనర్గా పనిచేసిన రోజుల్లో ఆయన ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా పనిచేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం చంద్రబాబు స్వయంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి అధికారిగా నియమించడం పట్ల అప్పట్లోనే విమర్శలు వినవచ్చాయి. పైగా, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వయంగా అప్పట్లో వికాస్ మర్మత్ వివాహానికి హాజరు కావడం కూడా జరిగింది