వార్త ముఖ్యాంశాలు
- కుప్పారెడ్డిపాలెం దొరవారిసత్రం 22/08/26 పున్నమి న్యూస్ రిపోర్టర్ దొరవారిసత్రం వాలిపోయి ఉన్న విద్యుత్తు స్తంభంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- మండలంలోని కుప్పారెడ్డిపాలెం సమీపం వ్యవసాయ పొలాల్లో 11 కేవీ విద్యుత్తు లైను స్తంభం వాలిపోయి ఉంది.
- దీనికి ఉన్న విద్యుత్తు తీగలు కిందకు జారిపోయి ప్రమాదకరంగా మారాయి.
కుప్పారెడ్డిపాలెం దొరవారిసత్రం 22/08/26
పున్నమి న్యూస్ రిపోర్టర్ దొరవారిసత్రం
వాలిపోయి ఉన్న విద్యుత్తు స్తంభంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కుప్పారెడ్డిపాలెం సమీపం వ్యవసాయ పొలాల్లో 11 కేవీ విద్యుత్తు లైను స్తంభం వాలిపోయి ఉంది. దీనికి ఉన్న విద్యుత్తు తీగలు కిందకు జారిపోయి ప్రమాదకరంగా మారాయి. తక్కువ ఎత్తులోని తీగలతో పొలాలకు వెళ్లే రైతులు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు పడకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.