Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాడపల్లిని టెంపుల్ టౌన్ కోసం ప్రణాళిక….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాడపల్లిని టెంపుల్ టౌన్ కోసం ప్రణాళిక….

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట గ్రామంలో జరిగిన సమావేశంలొ
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల పర్యటనలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు…

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

వాడపల్లిని టెంపుల్ టౌన్ గా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మూడో బుధవారం సందర్భంగా రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటనలను విజయవంతం చేసినందుకు కూటమి కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వాడపల్లి అభివృద్ధిపై ముఖ్యమంత్రి సైతం దృష్టిసారించినట్లు తెలిపారు. వాడపల్లి టెంపుల్ టౌన్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సైతం చెప్పినట్లు తెలిపారు. వాడపల్లి అభివృద్ధి చెందితే అక్కడ ఒక బస్టాండ్, హాస్పిటల్, మొదలైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయన్నారు. వాడపల్లి అభివృద్ధి తోటే రావులపాలెం అభివృద్ధి సైతం ముడిపడి ఉందన్నారు. శ్రీనివాసం 2 కాంప్లెక్స్ నిర్మాణం నిమిత్తం టిటిడి నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

END

వాడపల్లిని టెంపుల్ టౌన్ కోసం ప్రణాళిక….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *