వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఆదివాసీ తెగకు చెందిన సుర్పం ధర్ము, ఆత్రం గోదుబాయి, సిడం నాగుబాయి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న *సోనాపూర్ సర్పంచ్ పంద్రం సురేష్* ఈ రోజు దావఖానాకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, వారికి అరటి పండ్లను పంపిణీ చేశారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అక్కడ ఉన్న వైద్యులకు, సంబంధిత అధికారులకు సర్పంచ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు మాడవి బండు, మాడవి చందు, సింగం శ్రీనివాస్, సుర్పం జైరాం తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video: