Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

వంద పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వంద పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

వార్త ముఖ్యాంశాలు

  • *జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* *వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_*

*జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*

*వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి*

*_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_*

పెద్దపల్లి, జులై 24, పున్నమి ప్రతినిధి: సీజనల్ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించి, నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు, నిర్మాణం పూర్తి చేసుకున్న తాత్కాలిక క్యాజువాలిటిని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రి వెనుక ఉన్న చిన్న సందు విస్తరించి, అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా రిపోర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు.

ఈ తనీఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్, నర్సింగ్ సూపరిండెంట్ జమున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *