Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

లారీ డ్రైవర్ల వద్ద అక్రమ వసూళ్ళు చేస్తున్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
లారీ డ్రైవర్ల వద్ద అక్రమ వసూళ్ళు చేస్తున్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి: తొట్టంబేడు అటవీశాఖ పరిధిలో బసవయ్య పాలెం వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ పూతలపట్టు మరియు నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో ఉన్నది.అయితే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది తీరు దారుణంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు.ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పరిధిలో ఎర్రచందనం,కలప,అటవీ…

శ్రీకాళహస్తి: తొట్టంబేడు అటవీశాఖ పరిధిలో బసవయ్య పాలెం వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ పూతలపట్టు మరియు నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో ఉన్నది.అయితే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది తీరు దారుణంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు.ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పరిధిలో ఎర్రచందనం,కలప,అటవీ సంపద అక్రమ రవాణా జరగకుండా తనిఖీ చేయాల్సిన చెక్ పోస్ట్ సిబ్బంది తమ అధికారాన్ని అండగా చేసుకుని అన్ని అనుమతులు ఉండి కూడా రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల వద్ద బెదిరించి,వాగ్వాదానికి దిగుతూ అక్రమ వసూలు చేయడం పరిపాటిగా మారిపోయింది.శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న చెక్ పోస్ట్ అధికారి పట్టపగలు లారీ డ్రైవర్ వద్ద డబ్బులు ఇవ్వు లేక ఫోన్ పే చెయ్ అంటూ వసూలు మొదలుపెట్టాడు.ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్లపై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *