Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణనష్టాన్ని అరికట్టడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.
మార్కాపురంలో బుధవారం నిర్వహించిన రోడ్డు భద్రతా సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… రోడ్డు భద్రతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, హెల్మెట్ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని ప్రధాన రహదారులను పరిశీలించి గుంతలను తక్షణమే పూడ్చి, రహదారులను సురక్షితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రహదారి ఆక్రమణలను తొలగించడంతో పాటు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
త్రిపురాంతకం, దోర్నాల, కనిగిరి, మార్కాపురం టౌన్, రూరల్, బి.వి.పేట ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాద రహిత మార్కాపురం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *