వార్త ముఖ్యాంశాలు
- జలదంకి, అక్టోబర్ 6, పున్నమి ప్రతినిధి నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్న క్రాకా సోమశిల కాలువ కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు కావలి మండలం అడివిరాజుపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రమేష్ s/o అడివయ్య (57) గా…
- రెండు చక్రాల వాహనంపై పరికోట వెళ్లి నాటు కోడిని తీసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
- బైకు అదుపు తప్పి రోడ్డు మీద పడటంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు.సమాచారం తెలుసుకున్న జలదంకి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
జలదంకి, అక్టోబర్ 6, పున్నమి ప్రతినిధి
నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్న క్రాకా సోమశిల కాలువ కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు కావలి మండలం అడివిరాజుపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రమేష్ s/o అడివయ్య (57) గా గుర్తించారు. రెండు చక్రాల వాహనంపై పరికోట వెళ్లి నాటు కోడిని తీసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బైకు అదుపు తప్పి రోడ్డు మీద పడటంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు.సమాచారం తెలుసుకున్న జలదంకి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.