Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు భక్తులు ప్రయాణికులు ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు భక్తులు ప్రయాణికులు ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి ప్రాంతంలో వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా పెంచలకోన రోడ్డు మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • గత మే నెలలో లక్షలు పెట్టి వేసిన ప్యాచ్ లు నాశిరకంగా ఉండటం తో చిన్నపాటి వర్షానికే రోడ్డు ప్యాచ్ లు దెబ్బతిన్నాయి.
  • ఫలితంగా రోడ్డు నీటమునిగి ఆందోళన కలిగిస్తోంది.ఈ మార్గంలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వందలాది వాహనాలలో భక్తులు, ప్రయాణికులు ప్రయాణిస్తూండటంతో సమస్య మరింత పెరిగింది.

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

చేజర్ల మండలం ఆదురుపల్లి ప్రాంతంలో వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా పెంచలకోన రోడ్డు మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మే నెలలో లక్షలు పెట్టి వేసిన ప్యాచ్ లు నాశిరకంగా ఉండటం తో చిన్నపాటి వర్షానికే రోడ్డు ప్యాచ్ లు దెబ్బతిన్నాయి. ఫలితంగా రోడ్డు నీటమునిగి ఆందోళన కలిగిస్తోంది.ఈ మార్గంలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వందలాది వాహనాలలో భక్తులు, ప్రయాణికులు ప్రయాణిస్తూండటంతో సమస్య మరింత పెరిగింది. రోడ్డు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే నీరు పారేలా చర్యలు తీసుకోవాలని మరియు తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రజలు, భక్తులు అధికారులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *