Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

రైస్‌మిల్‌ కేసులో బాసర నాయకుల అరెస్ట్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైస్‌మిల్‌ కేసులో బాసర నాయకుల అరెస్ట్‌

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి

బాసర: ప్రభుత్వ ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై బాసర గ్రామానికి చెందిన నలుగురిని విజిలెన్స్‌, సారంగాపూర్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.11 కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

అదుపులోకి తీసుకున్న వారిలో బాసర మాజీ సర్పంచ్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దయల లక్ష్మణరావు, కిర్గుల్ (బీ) మాజీ సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి, అల్జాపూర్ సుధాకర్‌రావు, మల్కన్న యాదవ్‌ ఉన్నట్లు సమాచారం. వీరిని నిర్మల్‌లోని సబ్‌జైలుకు తరలించినట్లు తెలిసింది. సారంగాపూర్ మండలం ధని గ్రామంలో గల రైస్ మిల్ ద్వారా ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యం అప్పగించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ధాన్యాన్ని విక్రయించారన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
బాసర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే నలుగురు నాయకులు రైస్‌మిల్‌ కేసులో అరెస్టు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రైస్‌మిల్‌ కేసులో బాసర నాయకుల అరెస్ట్‌

Leave a comment

Your email address will not be published. Required fields are marked *