Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రైల్వే కోడూరులో ప్రతిభావంతుల విద్యార్థులకు అవార్డులు – జడ్జి తేజ సాయి చేతుల మీదుగా సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైల్వే కోడూరులో ప్రతిభావంతుల విద్యార్థులకు అవార్డులు – జడ్జి తేజ సాయి చేతుల మీదుగా సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభావంతుల విద్యార్థులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సివిల్ జూనియర్ జడ్జి శ్రీ పి.జె.తేజ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జడ్జి తేజ సాయి సూచించారు.

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభావంతుల విద్యార్థులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సివిల్ జూనియర్ జడ్జి శ్రీ పి.జె.తేజ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జడ్జి తేజ సాయి సూచించారు. దాత పాములపాటి సుబ్బారాయుడు వారి అన్న జ్ఞాపకార్థం ప్రథమ బహుమతిగా రూ.5,000, ద్వితీయ బహుమతిగా రూ.2,000, మహిళా విద్యార్థులకు రూ.3,000 చొప్పున బహుమతులు అందజేశారు. కీర్తిశేషులు యం.సుబ్బారెడ్డి గారి స్మారకార్థం బెస్ట్ స్టూడెంట్ అవార్డులను జడ్జి అందజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమం లో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరామరాజు, సీనియర్ న్యాయవాదులు శంకరయ్య, గజపతివర్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *