Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రైల్వేకోడూరు టోల్గేట్ లో ఘనంగా గాంధీ జయంతి – AITUC ఆధ్వర్యంలో నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రైల్వేకోడూరు టోల్గేట్ లో ఘనంగా గాంధీ జయంతి – AITUC ఆధ్వర్యంలో నివాళులు

వార్త ముఖ్యాంశాలు

  • జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఈ రోజు రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి AITUC నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.AITUC రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి *కామ్రేడ్ దాసరి జయచంద్ర* గారు మాట్లాడుతూ "సత్యం, అహింస,…
  • ఆయన చూపిన మార్గం నేటి కార్మికవర్గ పోరాటాలకు స్ఫూర్తిదాయకం.
  • గాంధీజీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో AITUC నియోజకవర్గ అధ్యక్షులు మాదరాజు గంగాధర్, ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నియోజకవర్గ కార్యదర్శి నంద్యాల సరోజనమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్…

జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఈ రోజు రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి AITUC నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.AITUC రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి *కామ్రేడ్ దాసరి జయచంద్ర* గారు మాట్లాడుతూ “సత్యం, అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన మహనీయుడు గాంధీజీ. ఆయన చూపిన మార్గం నేటి కార్మికవర్గ పోరాటాలకు స్ఫూర్తిదాయకం. గాంధీజీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో AITUC నియోజకవర్గ అధ్యక్షులు మాదరాజు గంగాధర్, ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నియోజకవర్గ కార్యదర్శి నంద్యాల సరోజనమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి పలిగల రత్నమ్మ, ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ డిప్యూటీ కార్యదర్శి ఎం. దినేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి వల్లెపు మల్లికార్జున, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పాండు, ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి మణికంఠ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షురాలు నిర్మలమ్మ, సహాయ కార్యదర్శి విజయలక్ష్మి, ఆయాలు జయమ్మ, నాగమణి, సునా తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *