Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

రైతు రుణాలపై మేడిపల్లి ఇండియన్ బ్యాంకుపై ప్రశ్నలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైతు రుణాలపై మేడిపల్లి ఇండియన్ బ్యాంకుపై ప్రశ్నలు!

రైతు రుణాలపై మేడిపల్లి ఇండియన్ బ్యాంకుపై ప్రశ్నలు!

సివిల్‌ స్కోర్‌ తదితర కారణాలతో రుణాల మంజూరులో ఇబ్బందులా?
ఇతర బ్యాంకుల వైపు చూస్తున్న రైతులు.. సమస్యలు పరిష్కరించాలని ఖాతాదారుల విజ్ఞప్తి

మేడిపల్లి, సెప్టెంబర్ 11: మేడిపల్లి ఇండియన్ బ్యాంకు శాఖలో రైతు రుణాల మంజూరుపై ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సివిల్‌ స్కోర్‌, ఇతర నిబంధనల పేరుతో కొందరు రైతులకు రుణాలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు నందివనపర్తి–యాచారం ఎస్బీఐ శాఖను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రుణాల మంజూరుతో పాటు బ్యాంకు సేవలపై కూడా ఖాతాదారుల్లో అసంతృప్తి నెలకొందని సమాచారం. ప్రజాప్రతినిధులు, యువత స్పందించి శాఖ అధికారులతో మాట్లాడి అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారుల వివరణ రావాల్సి ఉంది.

రైతు రుణాలపై మేడిపల్లి ఇండియన్ బ్యాంకుపై ప్రశ్నలు!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *