వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి కలెక్టరేట్, ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి రైతుల రహదారిపై అక్రమ ముళ్లకంచ వేసి ఆక్రమించుకున్న ఘటన ఘటన చిట్వేలు మండలం ఎం.గొల్లపల్లి లో చోటుచేసుకుంది.
- గ్రామ పరిధిలో రైతులు దశాబ్దాలుగా వినియోగిస్తున్న రహదారిపై ఏర్పాటు చేసిన అక్రమ ముళ్లకంచను తొలగించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.
- ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుకు వినతిపత్రం సమర్పించారు.
తిరుపతి కలెక్టరేట్, ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
రైతుల రహదారిపై అక్రమ ముళ్లకంచ వేసి ఆక్రమించుకున్న ఘటన ఘటన చిట్వేలు మండలం ఎం.గొల్లపల్లి లో చోటుచేసుకుంది. గ్రామ పరిధిలో రైతులు దశాబ్దాలుగా వినియోగిస్తున్న రహదారిపై ఏర్పాటు చేసిన అక్రమ ముళ్లకంచను తొలగించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుకు వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలోని సుమారు 400 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకల కోసం గ్రామకంఠంలోని సర్వే నంబర్ 117లో ఉన్న మార్గాన్ని దశాబ్దాలుగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ దారిలో ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలు రాకపోకలు సాగించేవని పేర్కొన్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి దారిని పూడ్చి ముళ్లకంచ ఏర్పాటు చేయడంతో పొలాలకు వెళ్లేందుకు, వ్యవసాయ పనులు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డుల్లో గ్రామకంఠంగా ఉన్న సర్వే నంబర్ 117లోని మార్గాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ ఆక్రమణలను తొలగించి రైతులకు రాకపోకల సౌకర్యం కల్పించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బడేల్ కుమార్రెడ్డి, కె. నాగభూషణరెడ్డి, కె. గంగారెడ్డి, ఎం. కిషోర్, ఎం. శీను తదితరులు ఉన్నారు.