Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.500 అప్పు కోసం దారుణం.. వ్యక్తిపై సలసల కాగే నూనెతో దాడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.500 అప్పు కోసం దారుణం.. వ్యక్తిపై సలసల కాగే నూనెతో దాడి!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: కేవలం రూ.500 అప్పు చెల్లించలేదనే కారణంతో ఓ మహిళ వ్యక్తిపై వేడి నూనెతో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ మండలంలో కలకలం రేపింది.
  • మాదరాజుగూడూరుకు చెందిన శీనయ్య, స్థానికంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న హసీనా వద్ద రూ.500 అప్పు తీసుకున్నాడు.
  • అప్పు తిరిగి చెల్లించాలని ఆమె కోరగా, ఇంటి వద్ద పనిచేసి అప్పు తీర్చానని శీనయ్య చెప్పాడు.

నెల్లూరు: కేవలం రూ.500 అప్పు చెల్లించలేదనే కారణంతో ఓ మహిళ వ్యక్తిపై వేడి నూనెతో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ మండలంలో కలకలం రేపింది. మాదరాజుగూడూరుకు చెందిన శీనయ్య, స్థానికంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న హసీనా వద్ద రూ.500 అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని ఆమె కోరగా, ఇంటి వద్ద పనిచేసి అప్పు తీర్చానని శీనయ్య చెప్పాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన హసీనా వేడిగా ఉన్న నూనెను శీనయ్యపై పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి హసీనాను అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *