Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రూ.40 లక్షలతో శ్రీ రాములస్వామి ఆలయ నిర్మాణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రూ.40 లక్షలతో శ్రీ రాములస్వామి ఆలయ నిర్మాణం

వార్త ముఖ్యాంశాలు

  • పుల్లంపేట: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని ఎగవరెడ్డి అరుంధతివాడలో నూతనంగా నిర్మించనున్న శ్రీ రాములస్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
  • దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు…
  • ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

పుల్లంపేట: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని ఎగవరెడ్డి అరుంధతివాడలో నూతనంగా నిర్మించనున్న శ్రీ రాములస్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *