Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రీ సర్వే అవకతవకలు సరిచేయాలి: జనసేన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రీ సర్వే అవకతవకలు సరిచేయాలి: జనసేన

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 10 (పున్నమి ప్రతినిధి) శుక్రవారం ఆయన ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న టిడిపి సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించిన అనంతరం మనుబోలు తాసిల్దార్ రమాదేవి ని వినతి పత్రాన్ని అందజేశారు.
  • ఆయన మాట్లాడుతూ వడ్లపూడి గ్రామంలో ఉప్పల ఆదెమ్మ అనే మహిళకు 1 ఎకరా భూమి ఇచ్చారన్నారు.
  • పదిమందికి 10 ఎకరాలు చొప్పున ఇచ్చారన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 10 (పున్నమి ప్రతినిధి)
శుక్రవారం ఆయన ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న టిడిపి సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించిన అనంతరం మనుబోలు తాసిల్దార్ రమాదేవి ని వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ వడ్లపూడి గ్రామంలో ఉప్పల ఆదెమ్మ అనే మహిళకు 1 ఎకరా భూమి ఇచ్చారన్నారు. పదిమందికి 10 ఎకరాలు చొప్పున ఇచ్చారన్నారు. అయితే ఆదెమ్మ సాగు చేసే సమయంలో మిగతావారు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇది రీ సర్వే వల్ల జరిగిందన్నారు. వందన అనే మహిళ పట్టా భూమిని అసైన్మెంట్ భూమిగా మార్చి వేశారన్నారు. గోవిందరాజుపురంలో స్మశాన వాటికకు స్థలాన్ని ఏర్పాటు చేసి బోరు చేయాలని ఎంపీడీవోని కోరమన్నారు. ఎంపీడీవో స్పందించి బోర్ ని వేశారన్నారు.అసైన్మెంట్ భూమిని స్మశానానికి కేటాయించి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.రీ సర్వేలో జరిగిన అవకతవకలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు జాకీర్ పెనుబాక మహేష్ ఖాదరవల్లి కిరణ్ గౌడ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు* .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *