Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తి మీద హక్కు మీదే అనే గ్యారెంటీ లేదు.. సుప్రీం కోర్ట్ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తి మీద హక్కు మీదే అనే గ్యారెంటీ లేదు.. సుప్రీం కోర్ట్ హెచ్చరిక

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 24 పున్నమి ప్రతినిధి @ ☛రిజిస్ట్రేషన్‌ అనేది యజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా Mutation తప్పనిసరి అని స్పష్టం చేసింది.
  • ☛రిజిస్ట్రేషన్ అనేది లీగల్ ప్రొసీజర్ మాత్రమే.
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఆగస్టు 24 పున్నమి ప్రతినిధి @
☛రిజిస్ట్రేషన్‌ అనేది యజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా Mutation తప్పనిసరి అని స్పష్టం చేసింది.

☛రిజిస్ట్రేషన్ అనేది లీగల్ ప్రొసీజర్ మాత్రమే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.

ప్రమాదం ఎప్పుడు*

.➥మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి ముందే ఎవరో కేసు వేసి ఉంటే.
➥పాత యజమానులు పూర్తి పత్రాలు ఇవ్వకపోతే.
➥బ్యాంకు బకాయిలు, లోన్లు క్లియర్ చేయకపోతే
➥లేఅవుట్ అప్రూవల్ లేదా RERA అనుమతి లేకపోతే…

రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మీ యజమాన్యం ఎప్పుడైనా సవాల్‌కు గురవుతుంది* .

సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ చేసే పని మాత్రమే చేస్తారు. కానీ అసలు యజమాన్యం ఎవరిది అనేది వారు నిర్ణయించలేరు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది యజమాన్యం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.

కొనుగోలు దారులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి

➥టైటిల్ చైన్ (పాత సేల్ డీడ్స్)
➥ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC)
➥మ్యూటేషన్ రికార్డులు (Adangal / 1B)
➥ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేవో
➥మునిసిపల్ / పంచాయతి అనుమతులు, లేఅవుట్ క్లియరెన్స్, RERA రిజిస్ట్రేషన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *