Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా నిర్మల్‌లో నిరాహార దీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా నిర్మల్‌లో నిరాహార దీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం నిర్మల్: ఢిల్లీలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,…
  • తన అధ్యక్షతన అక్టోబర్ 8న ఉదయం 10:30 గంటలకు నిర్మల్ RDO కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
  • ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం
నిర్మల్: ఢిల్లీలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్‌లో నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు తెలిపారు.
తన అధ్యక్షతన అక్టోబర్ 8న ఉదయం 10:30 గంటలకు నిర్మల్ RDO కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నిరాహార దీక్షలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, ప్రజాస్వామికవాదులు, సర్పంచులు, మండల అధ్యక్షులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీహరి రావు పిలుపునిచ్చారు.
స్థలం: RDO కార్యాలయం ఎదుట, నిర్మల్
తేదీ: 08-10-2026
సమయం: ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
– కూచాడి శ్రీహరి రావు
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *