వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల: రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఛాంపియన్షిప్–2026 పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్.వి.
- రాజారావు తెలిపారు.
- జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా స్థాయి ఎంపికల్లో 12 క్రీడాంశాల్లో 322 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
నంద్యాల: రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఛాంపియన్షిప్–2026 పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్.వి. రాజారావు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా స్థాయి ఎంపికల్లో 12 క్రీడాంశాల్లో 322 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటల వరకు క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు తదితర పత్రాలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.