Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఛాంపియన్‌షిప్‌కు నంద్యాల నుంచి క్రీడాకారుల ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఛాంపియన్‌షిప్‌కు నంద్యాల నుంచి క్రీడాకారుల ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్.వి.
  • రాజారావు తెలిపారు.
  • జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా స్థాయి ఎంపికల్లో 12 క్రీడాంశాల్లో 322 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

నంద్యాల: రాష్ట్ర స్థాయి అమెచ్యూర్ ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్.వి. రాజారావు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా స్థాయి ఎంపికల్లో 12 క్రీడాంశాల్లో 322 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటల వరకు క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు తదితర పత్రాలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *