Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఘన స్వాగతం పలికిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఘన స్వాగతం పలికిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల మరియు సినీ ఆటోగ్రాఫి శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి తల్లి గారి దశదిన కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డు…

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల మరియు సినీ ఆటోగ్రాఫి శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి తల్లి గారి దశదిన కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డు బ్లూ ఫ్లాక్స్ హోటల్ లో భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనేక అక్రమ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థ ఎన్నికలలో సరైన గుర్తింపు ఇవ్వడంతో పాటు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు కౌన్సిలర్లు లాగా గెలిపిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పట్టణం స్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం సమచిత పదవులు కల్పిస్తామని అన్నారు పలు సమస్యలపై కార్యకర్తలు మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది అలాగే పలు సమస్యలపై లెటర్లు కూడా వ్రాయడం జరిగింది ఇలాంటి సమస్యలున్న కార్యకర్తల కోసం మా ఇంటి డోర్లు ఎల్లప్పుడూ తెలిసి ఉంటాయని ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మా ఇంటికి రావొచ్చని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పోతాంశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు పడిగెల ప్రదీప్ ఈరపాక నరసింహ పిట్టల బాలరాజ్ ఇలియాస్ దాసరి మధు దేవరకొండ నరసింహ చారి మజర్ శిగ నరేష్ గౌడ్ జువ్వగాని శ్రీధర్ బింగి నరేష్ దేవరకొండ నరసింహ చారి చందుపట్ల గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ శ్రవణ్ రెడ్డి బర్రె నరేష్ పొట్ట శివ సాల్వేరు ఉపేందర్ కాకునూరి మహేందర్ పిట్టల బాలరాజ్ మంచుకంటి కృష్ణమూర్తి పల్లెర యాదగిరి మహేందర్ ప్రభాకర్ సాయి నరేందర్ తదితరులు పాల్గొనడం జరుగుతుంది..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *