రామకుప్పంలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు
రామకుప్పం, అక్టోబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) :
రామకుప్పం ప్రధాన కూడళ్లలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో రాత్రిపూట విద్యుత్ వెలుగులు ఉండేలా ఈ లైట్లను అమర్చుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో ఒక ఐమాక్స్ లైటు ఏర్పాటు చేస్తుండగా, రామకుప్పంలోని ప్రధాన కూడళ్లను గుర్తించి వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
