Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHUPALPALLE

రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

వార్త ముఖ్యాంశాలు

  • భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:00 గంటలకు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలు భూపాలపల్లిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు.
  • ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు.
  • ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్ మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బట్టు కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:00 గంటలకు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలు భూపాలపల్లిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్ మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బట్టు కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.

SIR ప్రక్రియపై BLAల ఫేజ్-2 సమావేశం

SIR ప్రక్రియలో భాగంగా BLAల ఫేజ్-2 సమావేశం రేపు ఉదయం 11:00 గంటలకు భూపాలపల్లి మండలం కొంపల్లిలోని వీఎల్ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు.

ఈ సమావేశంలో SIR ప్రక్రియలో భాగంగా BLAలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితా సవరణ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణ తదితర అంశాలపై ముఖ్యమైన సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

కాబట్టి భూపాలపల్లి నియోజకవర్గంలోని BLAలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల, పట్టణ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.

అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *