Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి**‘పెయిడ్ న్యూస్‌’పై ప్రత్యేక నిఘా.. జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు**జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు :పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరిగా పొందాలని, ఎన్నికల సమయంలో ‘పెయిడ్ న్యూస్‌’ను గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
  • రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు నం.

పల్నాడు :పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరిగా పొందాలని, ఎన్నికల సమయంలో ‘పెయిడ్ న్యూస్‌’ను గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు నం. 170/SEC-F1/2026, తేదీ 26.03.2026 ప్రకారం ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రకటనలు, ఇతర ప్రచురణలు ధృవీకరణ కోసం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కమిటీ లో కలెక్టర్ చైర్మన్, నరసరావుపేట మున్సిపాలిటీ కమిషనర్ , జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లు సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.జెడ్పీటీసీ , ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ పరిధిలో కమిటీ చైర్మన్ జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీ ఈ వో, సమాచార పౌర సంబంధాల అధికారి ఉంటారని తెలిపారు.*

*జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు*రాజకీయ ప్రకటనల ముందస్తు ధ్రువీకరణ, ఎన్నికల సమయంలో ‘పెయిడ్ న్యూస్‌’ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు.రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, సంబంధిత సంస్థలు ప్రకటనల ధ్రువీకరణకు అవసరమైన దరఖాస్తులను నిర్దేశిత పత్రాలతో కమిటీ కార్యాలయంలో సమర్పించాలి.ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి ధ్రువీకరణ ప్రక్రియ చేపడతారు.

*ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ*టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియో, సినిమా థియేటర్లు, ఆడియో-విజువల్ ప్రజా ప్రదర్శన వేదికలు, ఈ-పేపర్లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ సందేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్న రాజకీయ ప్రకటనలకు వర్తించే నిబంధనల ప్రకారం ముందస్తు ధ్రువీకరణ పొందాలి. ధ్రువీకరణ అవసరమైన ప్రకటనలను అనుమతి పొందిన తర్వాతే ప్రసారం లేదా ప్రచురణ చేయాలి.

జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్‌గా, జిల్లా కేంద్రంలోని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్, జిల్లా ప్రజా సంబంధాల అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు.

మూడు రోజుల ముందుగానే దరఖాస్తు చేయాలి రాజకీయ ప్రకటనల ధ్రువీకరణ కోసం నిర్దేశిత నమూనా (అనుబంధం-ఏ)లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు ప్రకటనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రూపంలో రెండు ప్రతులు, ధ్రువీకరించిన ట్రాన్స్‌క్రిప్ట్‌లు, వ్యయ వివరాలను జతచేయాలి. ప్రతిపాదిత ప్రసారం లేదా ప్రదర్శన తేదీకి కనీసం మూడు రోజుల ముందుగానే దరఖాస్తును కమిటీకి అందజేయాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ ముగియడానికి ముందు ఉండే 48 గంటల నిశ్శబ్ద కాలంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాజకీయ ప్రకటనలను ప్రచారం చేయరాదని తెలిపారు.

*‘పెయిడ్ న్యూస్‌’పై నిరంతర పర్యవేక్షణ*

జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురితమయ్యే వార్తలు, విశ్లేషణలను జిల్లా స్థాయి ఎంసీఎంసీ పర్యవేక్షిస్తుంది. నగదు లేదా ఇతర ప్రయోజనాలకు ప్రతిఫలంగా అభ్యర్థికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వార్తలు, విశ్లేషణలు ప్రచురించినట్లు గుర్తించిన సందర్భాల్లో, సంబంధిత నిబంధనల ప్రకారం వాటిని ‘పెయిడ్ న్యూస్‌’గా పరిశీలిస్తారు. అభ్యర్థి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన సందర్భాల్లో ప్రామాణిక ప్రకటనల రేట్ల ఆధారంగా ఖర్చును అంచనా వేసి, సంబంధిత అభ్యర్థికి నోటీసు జారీ చేస్తారు.

అభ్యర్థి వివరణ ఇచ్చేందుకు 48 గంటల గడువు కల్పించిన అనంతరం, వర్తించే నిబంధనల ప్రకారం నిర్ధారించిన మొత్తాన్ని ఎన్నికల వ్యయ ఖాతాలో చేర్చే చర్యలు చేపడతారు.

*ఎన్నికల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి*

ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రింటింగ్ ప్రెస్‌లు, కేబుల్ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *