Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి: మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి: మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరు గ్రామంలో గురువారం నిర్వహించిన ఖేత్ బచావో అభయాన్ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య రైతులకు అవగాహన కల్పించారు.
  • రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం భూముల సారాన్ని తగ్గించడంతో పాటు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.
  • పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరు గ్రామంలో గురువారం నిర్వహించిన ఖేత్ బచావో అభయాన్ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం భూముల సారాన్ని తగ్గించడంతో పాటు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, పురుగుమందులు వాడాలని, నానో యూరియా, నానో డీఏపీ అవసరమైన సమయంలో మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. కార్యక్రమంలో విఏఏ ఇర్షాద్, రైతు తిక్కవరపు వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *