Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రబీకి శనగ విత్తనాలు : మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రబీకి శనగ విత్తనాలు : మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

వార్త ముఖ్యాంశాలు

  • రబీ 2026 సీజన్‌కు నంద్యాల మండలానికి 450 క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాలు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు.
  • మండలంలో 477 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా, రైతులకు 35 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.క్వింటాలు పూర్తి ధర రూ.9,000 కాగా, రూ.3,150 రాయితీతో రైతు వాటా రూ.5,850గా ఉంటుందని తెలిపారు.
  • ప్రతి రైతుకు విస్తీర్ణాన్ని బట్టి ఒకటి నుంచి గరిష్టంగా 10 బస్తాల వరకు విత్తనాలు అందిస్తామని, రైతులు తమ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రబీ 2026 సీజన్‌కు నంద్యాల మండలానికి 450 క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాలు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు. మండలంలో 477 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా, రైతులకు 35 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.క్వింటాలు పూర్తి ధర రూ.9,000 కాగా, రూ.3,150 రాయితీతో రైతు వాటా రూ.5,850గా ఉంటుందని తెలిపారు. ప్రతి రైతుకు విస్తీర్ణాన్ని బట్టి ఒకటి నుంచి గరిష్టంగా 10 బస్తాల వరకు విత్తనాలు అందిస్తామని, రైతులు తమ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *