అనకాపల్లి జిల్లా, జూన్ 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.
గ్రామంలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల వినియోగం లేదా అనుమానాస్పద ఘటనలు గుర్తించిన వెంటనే ఎలమంచిలి రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కె. వీరరెడ్డి, హెచ్సీ బి.ఆర్. ప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు శనంశెట్టి శ్రీను, దారా నూకరాజు, రామ్ నాయుడు, కాపారపు శాంతరాజ్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సంప్రదించవలసిన నంబర్లు:
ఏఎస్ఐ కె. వీరరెడ్డి – 7013741180
హెచ్సీ బి.ఆర్. ప్రసాద్ – 9441571671

యువత భవిష్యత్తే లక్ష్యం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసుల పిలుపు
అనకాపల్లి జిల్లా, జూన్ 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల వినియోగం లేదా అనుమానాస్పద ఘటనలు గుర్తించిన వెంటనే ఎలమంచిలి రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కె. వీరరెడ్డి, హెచ్సీ బి.ఆర్. ప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు శనంశెట్టి శ్రీను, దారా నూకరాజు, రామ్ నాయుడు, కాపారపు శాంతరాజ్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సంప్రదించవలసిన నంబర్లు: ఏఎస్ఐ కె. వీరరెడ్డి – 7013741180 హెచ్సీ బి.ఆర్. ప్రసాద్ – 9441571671

