Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

యాచారం రైతుల సమస్యలపై యోగేంద్ర యాదవ్‌కు వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యాచారం రైతుల సమస్యలపై యోగేంద్ర యాదవ్‌కు వినతి

యాచారం రైతుల సమస్యలపై యోగేంద్ర యాదవ్‌కు వినతి

ఫార్మా, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన ప్రతినిధులు

రైతులకు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చిన యోగేంద్ర యాదవ్

హైదరాబాద్: ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో యాచారం మండలంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, భరత్ జోడో ఉద్యమ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం హైదరాబాద్‌లో యోగేంద్ర యాదవ్‌ను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూసేకరణ ప్రక్రియలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మోసం చేసిందని, చట్టవ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రతినిధులు యోగేంద్ర యాదవ్‌కు వివరించారు. రైతులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు భూసేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా జూలై 5న తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభకు సంబంధించిన నివేదికను కూడా యోగేంద్ర యాదవ్‌కు అందజేశారు. స్థానిక రైతులు, ప్రజల అభిప్రాయాలు, భూసేకరణ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివేదికలో వివరించినట్లు తెలిపారు.

రైతుల సమస్యలను సవివరంగా తెలుసుకున్న యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ.. యాచారం ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు చాలా అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నట్లు ప్రతినిధులు తెలిపారు. రైతుల హక్కుల పరిరక్షణకు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఈ అంశంపై రైతుల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పేరుతో తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, రైతుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యాచారం రైతుల సమస్యలపై యోగేంద్ర యాదవ్‌కు వినతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *