Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

“మొక్క నాటితే భవిష్యత్తు బంగారం… పిల్లల్లో విలువలు నాటితే సమాజం స్వర్ణాంధ్రం!”-LN KK దామోదర్ రావు ఇంపాక్ట్ TRAINER

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“మొక్క నాటితే భవిష్యత్తు బంగారం… పిల్లల్లో విలువలు నాటితే సమాజం స్వర్ణాంధ్రం!”-LN KK దామోదర్ రావు ఇంపాక్ట్ TRAINER

వార్త ముఖ్యాంశాలు

  • స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన లయన్స్ క్లబ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సభ్యులు గోనెగండ్ల మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పెద్దనేలటూరు పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”…
  • ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
  • కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లయన్ కె.కె.

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన లయన్స్ క్లబ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సభ్యులు

గోనెగండ్ల మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పెద్దనేలటూరు పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లయన్ కె.కె. ధామోదర్ రావు మాట్లాడుతూ, “స్వచ్ఛమైన పరిసరాలు, పచ్చని ప్రకృతి, మంచి విలువలు కలిగిన యువతతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, లక్ష్య నిర్ధారణ, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కల సంరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

“ఒక్క మొక్క – ఒక బాధ్యత, ఒక్క విద్యార్థి – ఒక మార్పు” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 🌱

-Sr Writer

Leave a comment

Your email address will not be published. Required fields are marked *