Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మొంథా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొంథా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలారెడ్డి
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video; hw-remosaic: false; touch: (-1.0, -1.0); modeInfo: Beauty ; sceneMode: 0; cct_value: 5794; AI_Scene: (-1, -1); aec_lux: 134.0; aec_lux_index: 0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0; albedo: ; confidence: ; motionLevel: 0; weatherinfo: null; temperature: 50;

వార్త ముఖ్యాంశాలు

  • బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామం సాతులూరు రోడ్డులో పర్యటించిన షర్మిలా రెడ్డి గారు మాట్లాడుతూ, అసలే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న రైతుకు మొంథా తుఫాను తీవ్ర నష్టాన్ని కలుగజేసింది.
  • ఈ ఒక్క గ్రామంలోనే 400 ఎకరాల వరి నీట మునిగిందని, రాష్ట్రమంతా కలిపి వరి,జొన్న, పత్తి, వేరుశెనగ,ఆక్వాకల్చర్ లాంటి మొత్తం వ్యవసాయం లో దాదాపు 20 నుండి 22 లక్షల ఎకరాలు పంట దెబ్బతిన్నదని, వ్యవసాయం సహా మిగిలిన అన్ని రంగాలలో కలిపి దాదాపు 20 వేల…
  • వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటను అసలు సర్వె చేయడం లేదని అంటున్నారని ఆమె ఆరోపించారు.

బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామం సాతులూరు రోడ్డులో పర్యటించిన షర్మిలా రెడ్డి గారు మాట్లాడుతూ, అసలే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న రైతుకు మొంథా తుఫాను తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఈ ఒక్క గ్రామంలోనే 400 ఎకరాల వరి నీట మునిగిందని, రాష్ట్రమంతా కలిపి వరి,జొన్న, పత్తి, వేరుశెనగ,ఆక్వాకల్చర్ లాంటి మొత్తం వ్యవసాయం లో దాదాపు 20 నుండి 22 లక్షల ఎకరాలు పంట దెబ్బతిన్నదని, వ్యవసాయం సహా మిగిలిన అన్ని రంగాలలో కలిపి దాదాపు 20 వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిందని ఆమె తెలియజేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటను అసలు సర్వె చేయడం లేదని అంటున్నారని ఆమె ఆరోపించారు.
రైతు పండించిన పంటను అమ్ముకునే దిక్కు ఉండడం లేదని మిల్లర్ల దగ్గరకు వెళితే వాళ్లు కూడా దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించారు
నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, స్తోమత లేక రైతులు పంట బీమా కూడా చెల్లించలేకపోతున్నారని ప్రభుత్వమే ఆ బీమా కూడా చెల్లించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *