Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్ తీరం దాటకుండానే విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో వీరుల్లాంటి విద్యుత్ సిబ్బంది సేవలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొంథా తుఫాన్ తీరం దాటకుండానే విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో వీరుల్లాంటి విద్యుత్ సిబ్బంది సేవలు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామంలో మొంథా తుఫాన్ విపరీతమైన బీభత్సం సృష్టించింది.
  • ప్రబలమైన గాలులతో చెట్లు విరిగి రహదారులపై పడిపోయాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామంలో మొంథా తుఫాన్ విపరీతమైన బీభత్సం సృష్టించింది. ప్రబలమైన గాలులతో చెట్లు విరిగి రహదారులపై పడిపోయాయి. ఈ ప్రభావంతో అనేక విద్యుత్ స్తంభాలు కూలిపోయి, తీగలు తెగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజల విద్యుత్ అందించే సేవలో తమ ప్రాణాలను సైతం సాహసంగా పెట్టారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డోన్ నాగేంద్ర నాయకత్వంలో లైన్మెన్ రాజు, లాజర్, సోమశేఖర్ తదితరులు క్షేత్రస్థాయిలోకి దిగి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. తుఫాన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, వర్షం మరియు గాలులను లెక్కచేయకుండా వీరు విద్యుత్ తీగలను సరిచేసి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రజలకు అతి తక్కువ సమయంలో విద్యుత్ అందించే లక్ష్యంతో వీరు అహర్నిశలు శ్రమించారు. వారి సేవలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. “మేమున్నాము, చింతించకండి” అంటూ తుఫాన్ విపత్తులోనూ ప్రజలకు ఆశాకిరణమై నిలిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *