Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొంథా తుఫాన్‌పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు”

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొంథా తుఫాన్‌పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు”

వార్త ముఖ్యాంశాలు

  • "మొంథా తుఫాన్‌పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు" 🔴మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు.
  • 🔴తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి శాఖాధికారులు తమ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
  • ☁️ “ఈ తుపాన్ సమయంలో గంటకు 100 కి.మీ.

“మొంథా తుఫాన్‌పై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి కీలక ఆదేశాలు”

🔴మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు.

🔴తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి శాఖాధికారులు తమ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

☁️ “ఈ తుపాన్ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు🌪️ వీసే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అవసరమైతే పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి — ప్రజలను ముందుగానే అక్కడకు సురక్షితంగా తరలించాలి.”

“ప్రజలను అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు.”

⚠️ ప్రజలకు సూచనలు:

🔴మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

🔴తుపాన్ సమయంలో పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి కాపాడుకోవాలి.

🔴విద్యుత్, నీటి, ఆహార సరఫరా వంటి సేవల్లో అంతరాయం రాకుండా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేయాలి.
☎️ అత్యవసర సహాయం కోసం:
📞 స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 112 మరియు 1070
📞 టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-0101
ఏ సహాయం కావాలన్నా రాష్ట్ర లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌లను సంప్రదించండి.

☎️📞ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం
8522084270,
9390011493.
ఇట్లు
మీ కాకర్ల సురేష్,
ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *