*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*
*ప్రజల ఆశీర్వాదమే అండగా.. గెలుపే లక్ష్యంగా వేముల.సరోజినీ ప్రచార జోరు!*
*ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన.*
*సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అక్టోబర్ 30:*
*మైలవరం 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల.సరోజినీ తన ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.*
*గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి ఆదరణను కోరుతూ ముందుకు సాగారు. ప్రతి ఓటరును ఆత్మీయంగా పలకరిస్తూ తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.*
*మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో బరిలో నిలిచిన వేముల.సరోజినీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.*
*ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి, అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నారు.*
*ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా!*
*ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యతతో ముందుకు సాగుతున్నానని వేముల.సరోజినీ పేర్కొంటున్నారు.*
*ప్రజలు తనపై ఉంచే విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నారు.*
*ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, ఆశీర్వాదాలు తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని, గ్రామ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ప్రజల మద్దతుతో విజయాన్ని సాధించాలనే ధృఢ సంకల్పంతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.*
*ఈ నేపథ్యంలో మైలవరం 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని వేముల. సరోజిని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.*
*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

