మైలవరం నియోజకవర్గంలో కూటమి జోరు.. ఏకగ్రీవాల దిశగా పలు గ్రామపంచాయతీలు!
గ్రామస్థాయిలో బలపడుతున్న తెలుగుదేశం పార్టీ.. వెలగలేరు, నాగులూరు, రామారాజ్య నగర్ పంచాయతీలు ఏకగ్రీవం
మైలవరం పంచాయతీలో ఆరు వార్డులు టీడీపీ ఖాతాలోకి.. వైసీపీకి అభ్యర్థుల కొరత
100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం:
మైలవరం నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి హవా కొనసాగుతోంది. గ్రామస్థాయిలో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతుతో పలు గ్రామపంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామపంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా, మరికొన్ని చోట్ల కూడా అదే తరహా ఫలితాలు వెలువడుతున్నాయి.
రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామపంచాయతీ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అదేవిధంగా నూతనంగా ఆవిర్భవించిన రామారాజ్య నగర్ గ్రామపంచాయతీ కూడా ఏకగ్రీవమైంది. వెలగలేరు గ్రామ పంచాయతీ కూడా ఏకగ్రీవం అయింది. ఈ పరిణామాలు నియోజకవర్గంలో కూటమి బలాన్ని చాటుతున్నాయి.
మైలవరం గ్రామపంచాయతీలోనూ తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో, ఆ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గ్రామస్థాయిలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.
ఎమ్మెల్యే వసంత నిరంతర పర్యవేక్షణ.. 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యం.
మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఎన్నికల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు మెరుగుపరిచేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ, ఈ గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యత, నాయకులు–కార్యకర్తల సమష్టి కృషితో మైలవరం నియోజకవర్గంలో కూటమి మరింత బలమైన శక్తిగా నిలుస్తోంది. ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న గ్రామపంచాయతీలు, వార్డులు కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
మొత్తంగా మైలవరం నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ కూటమి విజయపరంపర దిశగా అడుగులు వేస్తుండగా, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో 100 శాతం విజయ లక్ష్యంతో ఎన్నికల సమరం కొనసాగుతోంది.

