Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు ముగింపు పాల్గొన్న కోయసుధ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు ముగింపు పాల్గొన్న కోయసుధ

*విజయవంతంగా ముగిసిన మైలవరం శాఖ 59 గ్రంథాలయ వారోత్సవాలు*
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO బాలుగారు మరియు గ్రంథాలయ అధ్యక్షురాలు శ్రీమతి కోయ సుధా గారు, గౌరవాధ్యక్షులు జెడ్. నాగిరెడ్డి గారు పాల్గొన్నారు.*
మైలవరం శాఖ గ్రంధాలయం నందు 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలోముఖ్య అతిదిగా విచ్చేసిన (M. E. O) L. బాలు గారు మాట్లాడుతూ 59వ గ్రంథాలయ వారోత్సవాలు నేడు ముగింపు చేరుకున్నాయి. ఈ వారోత్సవాల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, వకృత్వం, మహిళలకు రంగవల్లి పోటీలు, పుస్తక ప్రదర్శన వంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. పుస్తకం పట్ల ప్రేమను పెంచుకున్నారు అని వివరించారు. తదుపరి గౌరవాధ్యక్షులు Z. నాగిరెడ్డి గారు,కోయసుధగారు మాట్లాడుతూ వారోత్సవాలు ముగుస్తున్నాయి అంటే పుస్తక పఠనం ఆగిపోవాలని కాదు. ఇది ప్రారంభం కావాలి అని ప్రతిరోజు కొంత సమయం గ్రంథాలయానికి వద్దాం.పుస్తకాలను మిత్రులుగా చేసుకుందాం అని వివరించారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు LBRC COLLEGE గ్రంథపాలకులు T. సాంబశివరావు గారు మాట్లాడుతూ పుస్తకం లేని ఇల్లు దీపం లేని ఇల్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోయా. సుధాగారు ( మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు, T. వెంకటేశ్వరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, దేవానందం గారు, మొదలగు వారు వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసి, ప్రశాంశ పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, పాఠకులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు ముగింపు పాల్గొన్న కోయసుధ

మైలవరం గ్రంధాలయం వారోత్సవాలు ముగింపు పాల్గొన్న కోయసుధ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *