Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
  • భూమి పత్రాలు, సంతకాలను ఫోర్జరీ చేసి రూ.147.79 కోట్ల రుణం పొందినట్లు బిజివేముల సురేంద్రనాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • విశాఖపట్నంలో తనకు చెందిన 2.89 ఎకరాల భూమి పత్రాలను అక్రమంగా తాకట్టు పెట్టి రుణం పొందారని ఆయన ఆరోపించారు.

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భూమి పత్రాలు, సంతకాలను ఫోర్జరీ చేసి రూ.147.79 కోట్ల రుణం పొందినట్లు బిజివేముల సురేంద్రనాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో తనకు చెందిన 2.89 ఎకరాల భూమి పత్రాలను అక్రమంగా తాకట్టు పెట్టి రుణం పొందారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గత నెల 30న పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *