Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పటిష్ట ఏర్పాట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పటిష్ట ఏర్పాట్లు

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి.
  • నిశాంతి తెలిపారు.
  • గురువారం పాడేరు కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. గురువారం పాడేరు కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 244 గ్రామ పంచాయతీలు ఉండగా, 239 షెడ్యూల్డ్, ఐదు నాన్ షెడ్యూల్డ్ పంచాయతీలు ఉన్నాయి. 244 సర్పంచ్, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మొదటి విడతలో కోయ్యూరు, జి.కె.వీధి, చింతపల్లి మండలాల్లో నవంబర్ 26న 66 పంచాయతీలకు, రెండో విడతలో అనంతగిరి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో నవంబర్ 29న 87 పంచాయతీలకు, మూడో విడతలో అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు మండలాల్లో డిసెంబర్ 2న 91 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *