Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ముస్లిం నాయకుడి ఆధ్వర్యంలో హిందూ పండుగ వేడుకలు.. ఖలీల్ ఆహ్వానం మేరకు పాల్గొన్న .డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ముస్లిం నాయకుడి ఆధ్వర్యంలో హిందూ పండుగ వేడుకలు.. ఖలీల్ ఆహ్వానం మేరకు పాల్గొన్న .డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా బుధరావుపేట్‌లోని .పల్లె .(హనుమాన్ టెంపుల్) వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖలీల్ గారి ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉత్సవాల్లో భాగంగా ఖలీల్ గారి ఆహ్వానం మేరకు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి* గారు పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు.
మతాలు వేరైనా పండుగల విషయంలో పరస్పర గౌరవం, సోదరభావం చాటుకోవడం సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో…. ఖానాపూర్ మండల సీనియర్ మధు,యాక సాయిలు, జూలూరి మనీష్ గౌడ్, అచ్చదయాకర్ సహదేవ్, హైమంత్,నాయకులు భక్తులు, యువకులు, స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం నాయకుడి ఆధ్వర్యంలో హిందూ పండుగ వేడుకలు.. ఖలీల్ ఆహ్వానం మేరకు పాల్గొన్న .డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *