వార్త ముఖ్యాంశాలు
- కొలిక్కి వచ్చిన కూటమి పొత్తులు!
- ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
- రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీకి సంబంధించి కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
కొలిక్కి వచ్చిన కూటమి పొత్తులు!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీకి సంబంధించి కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, బీజేపీకి ఒక కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 12 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.