Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

వార్త ముఖ్యాంశాలు

  • జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో వైద్యం పొందిన సందర్భంలో, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేశారు.
  • ఈ దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం, బాధితుల వైద్య ఖర్చుల కోసం ₹3,03,593 మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసింది.
  • ఈ మొత్తానికి సంబం ధించిన చెక్కులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈరోజు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.

జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో వైద్యం పొందిన సందర్భంలో, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేశారు.
ఈ దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం, బాధితుల వైద్య ఖర్చుల కోసం ₹3,03,593 మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబం ధించిన చెక్కులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈరోజు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, గ్రామ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *