Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

మీటర్లకు కేపాసిటర్లు తప్పనిసరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మీటర్లకు కేపాసిటర్లు తప్పనిసరి

వార్త ముఖ్యాంశాలు

  • రైతులు విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి.
  • ---- విద్యుత్ శాఖ ఏ.డి.
  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 దమ్మపేట వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ ఉపయోగించే రైతు సోదరులు తమ విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని అశ్వారావుపేట విద్యుత్ శాఖ ఏ.డి.

రైతులు విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి.
—- విద్యుత్ శాఖ ఏ.డి.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14

దమ్మపేట వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ ఉపయోగించే రైతు సోదరులు తమ విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని అశ్వారావుపేట విద్యుత్ శాఖ ఏ.డి. నందయ్య పేర్కొన్నారు. మండలంలోని పార్కలగండిలో మంగళవారం విద్యుత్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన రైతు పొలంబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆటో స్టాటర్ల వినియోగం తగ్గించాలని ,విద్యుత్ ను అవసరం మేరకే వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏ.డి.ఈ వెంకటరత్నం ,ఏఇ సాయికిరణ్ , సబ్ ఏఇ వెంకటేశ్వరరావు ,మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *