Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్

వార్త ముఖ్యాంశాలు

  • కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని రోడా మేస్త్రి నగర్ డివిజన్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని రోడా మేస్త్రి నగర్ డివిజన్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు…

సమాజంలో ప్రతి ఒక్కరు కుల మతాలకతీతంగా మతసామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు,ముస్లిం మైనార్టీ మత పెద్దలతో పాటు స్థానిక నాయకులు జహంగీర్, సలీం, రషీద్, షాకీర్ తదితరులతో పాటు ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *