Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

మాధవ నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాధవ నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

కాలనీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు

ఎల్బీనగర్: చంపాపేట్ డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ ఎంపిక కార్యక్రమంలో ముత్యాల విజయ మొదటి బహుమతి, అరుణ రెండో బహుమతి, శోభారాణి మూడో బహుమతి సాధించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మధులస, కవిత, అమల ముదిరాజ్, ముత్యాల ప్రణవి, నిర్మల రెడ్డి, జ్యోతి రెడ్డి, రజిత రావు, అనిత రెడ్డి, పి. విజయ, శోభారాణి, అరుణ తదితర మహిళలు పాల్గొన్నారు. అలాగే కాలనీ కమిటీ సభ్యులు ఉయ్యాల యాదయ్య గౌడ్, ముత్యాలు, లక్ష్మణ్ యాదవ్, విక్రమ్ రాజు, యాదయ్య గౌడ్, పురుషోత్తం రెడ్డి, గంట శేఖర్ రెడ్డి, దిండి నారాయణరెడ్డి తదితరులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పండుగ సంబరాలతో మాధవ నగర్ కాలనీలో సందడి నెలకొంది.

మాధవ నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

మాధవ నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *