Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో దద్దాల కీలక భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో దద్దాల కీలక భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి : మార్కాపురం జిల్లా లో రానున్న కనిగిరి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని తన నివాసంలో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
  • కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తో కలిసి మున్సిపల్ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై 30 నిముషాలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు.
  • ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగిన మేలును ప్రజలకు వివరించాలని సూచించారు.

కనిగిరి : మార్కాపురం జిల్లా లో రానున్న కనిగిరి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని తన నివాసంలో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తో కలిసి మున్సిపల్ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై 30 నిముషాలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగిన మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారన్నారు.కనిగిరి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా వైఎస్సార్సీపీ ఖాతాలో వేయాలని, అందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, జగన్మే ఆదేశాలరకు కనిగిరి మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబందించి ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు పూర్తి చేశామని, చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేసి వై.ఎస్.జగన్ కి హామీ ఇవ్వడం జరిగిందని దద్దాల నారాయణ యాదవ్ వెల్లడించారు. అదేవిదంగా 2024 పార్టీ ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న మరియు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినట్లు ఆయన తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *