Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

మహిళలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించిన లీలా కైవల్య రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించిన లీలా కైవల్య రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, జూలై 27 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే "ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు" కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తనయ లీలా కైవల్య రెడ్డి మహిళా మాజీ…
  • ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.
  • మహిళల సమస్యలను తెలుసుకుని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఆత్మకూరు, జూలై 27 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తనయ లీలా కైవల్య రెడ్డి మహిళా మాజీ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులతో కలిసి ఆత్మకూరు పట్టణంలోని ముస్తాపురం ప్రాంతంలో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మహిళల సమస్యలను తెలుసుకుని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా మాజీ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *