Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా జేత్యా/బోజ్జతండా పరిధిలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బానోత్ బన్నీలాల్‌కు సుప్రజ అలియాస్ బిందుతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది నెలల కుమార్తె ఉంది.
ఇటీవల కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల నేపథ్యంలో తల్లి సుప్రజ తన చిన్నారి కుమార్తె త్రిషను గొంతు నులిమి చంపినట్లు సమాచారం. అనంతరం బాత్రూమ్ శుభ్రం చేసే లిక్విడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
గమనించిన స్థానికులు వెంటనే ఆమెను మానుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ అంజలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *