Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

మరిపెడలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మరిపెడలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

మరిపెడ మండల కేంద్రంలో ఐదో రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారి సతీమణి డాక్టర్ ప్రమీల గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రమీల గారు మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, వారితో కలిసి పండుగ సంబరాలను పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకలతో మరిపెడ మండల కేంద్రంలో పండుగ సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మరిపెడ మండల అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్, టౌన్ అధ్యక్షులు రామ్ లాల్, జిల్లా నాయకులు, మరిపెడ మాజీ మండల అధ్యక్షులు పెండ్లి రఘు రెడ్డి, జిల్లా యువజన నాయకులు నరసింహారెడ్డి, గుండబోయిన వేణు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిపెడలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

మరిపెడలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *