Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు నూతన కూటమి ఎంపీపీగా గాలి శాంతిప్రియ బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మనుబోలు నూతన కూటమి ఎంపీపీగా గాలి శాంతిప్రియ బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 19 (పున్నమి ప్రతినిధి) మనుబోలుమండల నూతన కూటమి ఎంపీపీగా శ్రీమతి గాలి శాంతిప్రియ ను అలాగే మండల ఉపాధ్యక్షుడుగా మడవనూరు ఎంపీటీసీ సభ్యుడు పముజుల నాగరాజు ను ఎన్నుకున్నారు.
  • గురువారంసాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
  • పూజారి సుబ్రహ్మణ్యం శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 19 (పున్నమి ప్రతినిధి)
మనుబోలుమండల నూతన కూటమి ఎంపీపీగా శ్రీమతి గాలి శాంతిప్రియ ను అలాగే మండల ఉపాధ్యక్షుడుగా మడవనూరు ఎంపీటీసీ సభ్యుడు పముజుల నాగరాజు ను ఎన్నుకున్నారు. గురువారంసాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పూజారి సుబ్రహ్మణ్యం శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పార్టీ ఇన్‌చార్జి రామమూర్తిరెడ్డి, గాలి రాజేష్ రెడ్డి, మధు నాయుడు, బి.వి. కూరపాటి సురేష్ తదితర నాయకులు శాంతిప్రియ దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందించారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గాలి రామకృష్ణారెడ్డి అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *