Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు గిరిజన కాలనీలో ఉద్రిక్తత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో సోమవారం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
  • కాలనీకి చెందిన సిద్ధపరెడ్డి వెంకటరమణయ్య బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎరుకల కాలనీకి చెందిన వ్యక్తి దాడి చేసినట్లు గిరిజనులు ఆరోపించారు.
  • కాలనీవాసులు అక్కడికి చేరుకోవడంతో ఆ వ్యక్తి పరారయ్యాడు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో సోమవారం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కాలనీకి చెందిన సిద్ధపరెడ్డి వెంకటరమణయ్య బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎరుకల కాలనీకి చెందిన వ్యక్తి దాడి చేసినట్లు గిరిజనులు ఆరోపించారు. కాలనీవాసులు అక్కడికి చేరుకోవడంతో ఆ వ్యక్తి పరారయ్యాడు. ఆదివారం వీధిలో దాయాలు ఆడుతున్న వారిని దారి ఇవ్వాలని కోరడంతో వివాదం మొదలైందని తెలిపారు. ఈ ఘటనలో దాచూరు సీనయ్య, తుపాకుల నాగరాజు, కోట్లపాటి రవిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. గాయపడిన వెంకటరమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *